దీపావళి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే? | Deepavali History in Telugu | Diwali | Bhakthi Samacharam

దీపావళి విశిష్టత ఏంటి? రోజున ఈ మంత్రాన్ని జపిస్తే?

ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ.

దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి.. నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ. హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్తులు ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినమే దీపావళి ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ ఏడాది నవంబరు 12, 13 ఆది, సోమవారాల్లో జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా దీపావళి విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం

దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా.. నీలకాంతి విష్ణు భగవానునిగా.. తెల్లని కాంతి పరమశివునికి ప్రతినిధులుగా చెపుతారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆశ్వయుజ మాసం అమావాస్య స్వాతి నక్షత్రము రోజును దీపావళిగా చెప్తారు. పురాణాల ప్రకారం దీపావళి అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. 

దీపావళి భారతదేశం అంతటా జరుపుకునే ఒక పండుగ. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీనిని దీవాలి అని దీపావళి అని కూడా పిలుస్తారు. ప్రజలు తమ ఇళ్లలో,దుకాణాలలో దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి, సంపద, అదృష్టం , శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళికి ముందు, ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు సానుకూలతను స్వాగతించడానికి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని ఈ పండుగ జరుపుకుంటారు.

దీపావళి అంటే బాగా గుర్తొచ్చేది శ్రీకృష్ణ, సత్యభామ.. నరకాసురుడిని వధించడమే. అయితే ఈ కథ కాకుండా మన పురణాలు మరో మూడు కథలను కూడా ఉన్నాయి. మరి ఆ కథలేమిటో.. వాటికి దీపావళికి సంబంధమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సత్యభామ నరకాసుర సంహారంతో దీపావళి వేడుకలు దీపావళి పండుగకు

సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు సత్యభామ నరకాసురుణ్ణి సంహరిస్తుంది.నరకాసుర సంహారంతో బహుళ చతుర్దశి నరక చతుర్దశి గా ప్రసిద్ధి పొందింది. 

నరకాసురుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలను ఇబ్బందులు పెడుతూ అందరినీ వేధింపులకు గురి చేస్తుండేవాడు. కృతయుగం లో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి భూదేవికి అసుర సంధ్యా సమయంలో పుట్టిన నరకుడు తన చావు తల్లి చేతిలో పొందాలని వరం కోరుకుంటాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించి మహావిష్ణువు, సత్యభామను పెళ్లాడతాడు. 

భూదేవి అంశ అయిన సత్యభామ శ్రీకృష్ణుడు తో కలిసి నరకాసురుని అకృత్యాలను అరికట్టడానికి యుద్ధానికి వెళుతుంది. ఈ యుద్ధంలో సత్యభామ నరకాసురుని హతమారుస్తుంది. నరకాసురుని సత్యభామ సంహరించినందుకు, నరకాసురుడి పీడ విరగడయినందుకు అందరూ సంబరాలు జరుపుకుంటారు. దీపాలు వెలిగించి దీపావళి వేడుకను చేసుకుంటారు.

రామాయణంలోని ఒక కథ

హిందూ ఇతిహాసం రామాయణంలోని ఒక కథ దీపావళి పండుగకు సంబంధించి ప్రాచుర్యంలో ఉంది. 14 ఏళ్ళ తర్వాత రాముడు వనవాసం ముగించుకుని రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, అయోధ్య నివాసులు దీపాలు వెలిగించి స్వాగతం పలికారు.అయోధ్య దేదీప్యమానంగా వెలిగిపోయింది. 

శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి రావడం శ్రేయస్సు , ఆనందాన్ని సూచిస్తుందని అందుకే ఆ రోజును దీపావళిగా అయోధ్య వాసులు జరుపుకోగా అప్పటినుండి ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది అని ఓ పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది.

లక్ష్మీదేవి ఉద్భవించినరోజు..

దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రమును చిలుకుతుండగా.. లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆరోజును దీపావళిగా చెప్తారు. అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని.. దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషంగా భావిస్తారు.

అజ్ఞాతవాసం తర్వాత

మహాభారతంలో కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తారు. ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళిగా చెప్తారు. అలా పాండవులు తిరిగివచ్చిన రోజున దీపావళి పండుగగా చేస్తారు.

దీపావళి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే?

హిందూ పురాణాల ప్రకారం దేవతా మంత్రాలకు అపారమైన శక్తి ఉంది. దీని వల్ల అపరమితమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. సరైన పద్ధతిలో వీటిని ఉచ్ఛరిస్తే దైవత్వ ప్రకంపనలు సిద్ధిస్తాయి. విశ్వంలోని ఈ ప్రకంపనలు మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైంది లక్ష్మీ మంత్రం. 

దీన్ని సిద్ధి మంత్రం అని కూడా అంటారు. ఇందులోని ప్రతి అక్షరం అత్యంత శక్తివంతమైంది. మనస్ఫూర్తిగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయాలు దరిచేరుతాయి. అయితే దీపావళి రోజున కొన్ని ప్రత్యేక మంత్రాలను ఉచ్ఛరిస్తే కోరికలు ఫలించి, ప్రయోజనాలు కలుగుతాయి

1. ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ: మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

2. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ: మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ సమృద్ధి సాధిస్తారు.

3. ఓం శ్రీం శ్రీ అయే నమ: మంత్రాన్ని పలకడం వల్ల సంతోషం లభిస్తుంది.

4. ఓం మహాదేవ్యేచ విద్మహే, విష్ణు పత్నేచ దీమహే... తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం. ఈ మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు.

5. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః

6. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమ: అనే శుక్ర బీజ మంత్రాన్ని శుక్రవారం నాడు 108 సార్లు జపించాలి. పూజగదిని శుభ్రం చేసి, లక్ష్మీదేవి ముందు నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. శుక్ర బీజ మంత్రం. దీన్ని 108 సార్లు ప్రతి శుక్రవారం ఉచ్ఛరిస్తే పరిస్థితుల్లో మార్పులు తప్పకుండా వస్తాయట.

ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, పాత సామాన్లను శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అందుకే ధనలక్ష్మీ, కుబేరులను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. 

బంగారం, వెండి కాకుండా ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసి శుభం జరుగుతుందంటారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృతభాండం అవుతుందని చాలా మంది నమ్ముతారు.

tags:  nitya pooja vidhanam in telugu , nitya parayana slokas in telugu, nitya parayana mantralu , daily puja procedure at home , daily pooja vidhi ,most powerful mantras in telugu , most powerful slokas , deepavali 2023 date andhra pradesh, deepavali 2023 date and time, deepavali amavasya 2023 date and time, diwali 2023 muhurat time , diwali 2023 date muhurat time, deepavali pooja vidhanam, లక్ష్మి పూజ విధానం , deepavali pooja vidhanam in telugu pdf, Diwali pooja vidhanam in telugu pdf, Diwali 2023, deepavali amavasya 2023, deepavali amavasya pooja vidhanam in telugu, Deepavali lakshmi pooja vidhanam, diwali lakshmi pooja vidhanam,deepavali amavasya importance in telugu, 10 points about diwali in telugu, diwali significance in telugu, what is the importance of diwali in the culture of india,naraka chaturdashi, naraka chaturdashi 2023, why is naraka chaturdashi celebrated,naraka chaturdashi history in telugu,naraka chaturdashi story in telugu, naraka chaturdashi pooja vidhanam in telugu  , lakshmi pooja on diwali, diwali laxmi puja date 2023, diwali laxmi puja 2023 date and time, diwali lakshmi puja procedure in telugu, diwali lakshmi puja muhurat 2023, diwali lakshmi pooja procedure, diwali significance in telugu, lakshmi pooja on diwali, diwali laxmi puja date 2023, diwali laxmi puja 2023 date and time, diwali lakshmi puja procedure in telugu, diwali lakshmi puja muhurat 2023, diwali lakshmi pooja procedure, diwali significance in telugu

Comments